తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తల్లి తిట్టిందని యువకుడు ఆత్మహత్య - vivek

తల్లి మందలించిందని ఓ కుమారుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. క్షణికావేశంతో వివేకం కోల్పోయాడు. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

తల్లి తిట్టిందని యువకుడు ఆత్మహత్య

By

Published : Mar 9, 2019, 6:34 AM IST

తల్లి తిట్టిందని యువకుడు ఆత్మహత్య
సికింద్రాబాద్​ బోయిన్​పల్లి పరిధిలోని డైరీఫామ్​ సమీపంలో ఓ యువకుడు ఒంటికి నిప్పంటించుకొనిఆత్మహత్య చేసుకున్నాడు. ​ చింతల్​ గణేష్​ నగర్​కు చెందిన వివేక్​తల్లి మందలించిందని రెండు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయాడు. శుక్రవారం తన స్నేహితునికి వీడియో కాల్​​ చేసి ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు.

క్షణికావేశంతోనే...

మృతుడు వివేక్​ ప్రతి విషయానికి కోపంతో ఊగిపోయేవాడని, క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నాడని స్నేహితులు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:ఆస్తి కోసం కత్తి దాడి

ABOUT THE AUTHOR

...view details