తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వాట్సాప్​లో స్టేటస్ పెట్టి యువకుడి బలవన్మరణం - kurnool district news

అమ్మా వెళ్లిపోతున్నా.. అని చెప్పాడు. 'నేను చనిపోతున్నా, శవాన్ని రాంజల చెరువులో నుంచి తీసుకోవాలంటూ..' వాట్సాప్​లో స్టేటస్ పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​ కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది.

suicide
వాట్సాప్​లో స్టేటస్ పెట్టి యువకుడి బలవన్మరణం

By

Published : Jan 8, 2021, 12:02 PM IST

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన లక్ష్మీ నారాయణ అనే యువకుడు.. రాంజల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నేను మీ అందరి దృష్టిలో చెడ్డవాడిని కానీ మీ గురించి ఎప్పుడూ అలా ఆలోచించలేదు అంటూ సందేశం పంపించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఏదో ఒకరోజు అందరికీ నా మంచితనం తెలుస్తుందని అందులో రాశాడు. తన శవాన్ని రాంజల చెరువు వద్ద స్వాధీనం చేసుకోమని వాట్సాప్​లో స్టేటస్ పెట్టాడు.

వాట్సాప్​లో స్టేటస్ పెట్టి యువకుడి బలవన్మరణం

లక్ష్మీ నారాయణ రెండు నెలల కిందట ఇంటి నుంచి వెళ్లి కర్నూలులో ఉద్యోగం చేస్తున్నాడని బాధితుడి తల్లి వీరమ్మ తెలిపింది. ఈ రోజు మధ్యాహ్నం ఆదోని వచ్చి, చనిపోతున్నట్లు చెప్పడానికి ఫోన్ చేశాడని పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details