ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు యువకుడు మృతి - తర్నికల్‌లో యువకుడు మృతి
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్‌లో వ్యవసాయ క్షేత్రంలోని నీటి గుంటలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. హైదరాబాద్‌కు చెందిన కార్తీక్ ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయినట్టు ఎస్సై తెలిపారు.
ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు యువకుడు మృతి
నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్‌లో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి కార్తీక్(22) అనే యువకుడు మృతి చెందాడు. హైదరాబాద్‌కు చెందిన కార్తీక్ స్నేహితుడితో కలిసి... ఆదివారం సోమశిల సందర్శించాడు. అనంతరం తర్నికల్లోని స్నేహితుడికి సంబంధించిన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అక్కడ ఉన్న ఫాంపాండ్‌లో ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి చినిపోయాడు. మృతుని తండ్రి రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.