బెట్టింగ్లో డబ్బులు పోగొట్టాడని తండ్రి మందలించినందుకు... మెదక్ జిల్లా మక్తభూపతిపూర్లో జియ్యారి మహేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి తిట్టాడని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మహేష్... చెరువులో దూకాడు. మృతుడికి ఆరు నెలల క్రితమే వివాహమైనట్టు తెలుస్తోంది.
తండ్రి తప్పని చెప్పినందుకు తనయుడు తనువు చాలించాడు - చెరువులో దూకి యువకుడు మృతి
మెదక్ జిల్లా మక్తభూపతిపూర్లో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్లో డబ్బులు పోయాయని తండ్రి మందలించినందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు పోలీసులు వెల్లడించారు.
తండ్రి మందలించాడని చెరువులో దూకి యువకుడు ఆత్మహత్య
ఆదివారం రాత్రి పది గంటల నుంచి కనిపించడం లేదని తండ్రి రామకృష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇవాళ ఉదయం చెరువులో మృతదేహం కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహేష్ మృతదేహంగా గుర్తించిన పోలీసులు... గ్రామస్థుల సాకారంతో బయటకు తీసి పోస్టుమార్టం కోసం మెదక్ ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి:తయారీ రంగంలో రికవరీ: ఫిక్కీ