ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నాగోల్‌లోని ఓయో వైట్రిడ్జ్ హోటల్లో ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆర్థిక ఇబ్బందులు తాళలేకపోయాడు.. హోటల్లో ఉరి వేసుకున్నాడు! - ఓయో రిడ్జి లాడ్జిలో యువకుడు ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ముప్పై ఏళ్లకే తనువు చాలించాడు ఓ యువకుడు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాగోల్‌లోని ఓయో వైట్రిడ్జ్ హోటల్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆర్థిక ఇబ్బందులు తాళలేకపోయాడు.. హోటల్లో ఉరి వేసుకున్నాడు
హోటల్ సిబ్బంది సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుడు ఖమ్మం జిల్లా, ఖానాపూర్ హవేలి ద్వారకా నగర్‌కు చెందిన వినయ్(30) గా పోలీసులు గుర్తించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:అప్పుడే పెళ్లి చేసుకున్నారు.. అంతలోనే అనంత లోకాలకు..