మెదక్ జిల్లా, మండల కేంద్రంలోని పాతూరు గ్రామంలో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులకు తాళలేక మైలి నర్సింహులు(24) ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆర్థిక ఇబ్బందులతో యువరైతు ఆత్మహత్య - మెదక్ జిల్లా సమాచారం
చిన్న వయసులోనే సమస్యలు చుట్టుముట్టాయి. కుటుంబ బాధ్యతలు మోయాల్సిన యువకుడు అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఒకవైపు కుటుంబ కలహాలు, మరోవైపు ఆర్థిక సమస్యలు తోడవడంతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మెదక్ జిల్లా, మండల కేంద్రంలోని పాతూరు గ్రామంలో ఘటన జరిగింది.
ఆర్థిక ఇబ్బందులతో యువరైతు ఆత్మహత్య
కుటుంబ సమస్యలు, అనారోగ్యంతో మనస్తాపం చెంది ఆత్యహత్య చేసుకున్నాడని మృతురాలి భార్య స్వప్న తెలిపారు. తెల్లవారుజామున ఉరివేసుకుని ఉంటాడని మెదక్ జిల్లా రూరల్ ఎస్సై కృష్ణారెడ్డి ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించామని ఆయన తెలిపారు.