తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మిస్టరీగా మారిన యువతి మరణం... అసలేమైంది? - సూర్యాపేట నేర వార్తలు

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని ఓ తండాకు చెందిన యువతి మరణం అనుమానాస్పదంగా మారింది. తమ బిడ్డపై అత్యాచారం చేసి కిరాతకంగా హత్యచేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మిస్టరీగా మారిన యువతి మరణం... అసలేమైంది?
మిస్టరీగా మారిన యువతి మరణం... అసలేమైంది?

By

Published : Nov 2, 2020, 10:47 PM IST

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని ఓ తండాకు చెందిన ఓ యువతి మృతి మిస్టరీగా మారింది. తమ బిడ్డపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అసలేమైందంటే...

చింతలపాలెం మండలానికి చెందిన యువతి నల్గొండలో డిగ్రీ చదువుతోంది. మూడురోజుల క్రితం స్నేహితులతో కలిసి నల్గొండ నుంచి హైదరాబాద్​కు వెళ్లింది. ఇంతలో ఏమైందో తెలియదు గాని... మరుసటి రోజే యువతికి ఆరోగ్యం బాగాలేదని వసతిగృహం నుంచి ఇంటికి ఫోన్​ వచ్చింది.

యువతిని కోదాడ, ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడం వల్ల అక్కడి నుంచి హైదరాబాద్​కు తీసుకొస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. యువతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తుండగా... పోలీసులు ఆపి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

తమ బిడ్డపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కోదాడ డీఎస్పీ రఘు తెలిపారు.

ఇదీ చూడండి:ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యం

ABOUT THE AUTHOR

...view details