రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్మగూడలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి సరూర్‌నగర్‌కు చెందిన నరేందర్ అనే వివాహితుడే కారణమని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మానసికంగా కుంగిపోయింది..
ఇంజినీరింగ్ చదివిన తన కూతురు ఒక సాఫ్ట్వేర్ కోర్స్‌లో శిక్షణ పొందేదని... ఈ క్రమంలో నరేందర్‌తో పరిచయం ఏర్పడిందని మృతురాలి తండ్రి దేవరకద్ర నరేందర్ గౌడ్ తెలిపాడు. అమాయకురాలైన తన కూతురు నరేందర్ మాయలో పడి మానసికంగా కుంగిపోయి.. కుటుంబ సభ్యులందరితో వింతగా ప్రవర్తించేదని ఆవేదన వ్యక్తం చేశాడు.