సూర్యాపేట జిల్లా చింతలపాలెం గ్రామానికి చెందిన యువతిపై హత్యాచారం జరిగిందంటూ పెద్దఎత్తున ఆందోళన చేపట్టిన బంధువులు ఎట్టకేలకు విరమించుకున్నారు. తమ కూతురికి న్యాయం చేయాలంటూ యువతి తల్లిదండ్రులు, బంధువులు కోదాడ ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. హుజూర్నగర్, కోదాడ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్ హామీ ఇచ్చినా వారు వినలేదు. చివరికి ఆర్డీవో రాతపూర్వక హామీతో యువతి మృతదేహాన్ని అధికారులు ఇంటికి తరలించారు.
అసలేమైందంటే...
చింతలపాలెం మండలానికి చెందిన యువతి నల్గొండలో డిగ్రీ చదువుతోంది. మూడురోజుల క్రితం స్నేహితునితో కలిసి ద్విచక్రవాహనంపై నల్గొండ నుంచి హైదరాబాద్కు వెళ్లింది. ఇంతలో ఏమైందో తెలియదు గాని... మరుసటి రోజే యువతికి ఆరోగ్యం బాగాలేదని వసతిగృహం నుంచి ఇంటికి ఫోన్ వచ్చింది.