తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పెళ్లైన వ్యక్తితో ప్రేమ.. పెద్దలు వద్దనడంతో ఆత్మహత్య - News of a woman's death in Turkyanjal

పెళ్లైన వ్యక్తితో ఓ యువతి ప్రేమలో పడింది. అతడినే వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఇంట్లో వాళ్లు నిరాకరించారు. తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

suicide
పెళ్లైన వ్యక్తితో ప్రేమ.. పెద్దలు వద్దనడంతో ఆత్మహత్య

By

Published : Jan 16, 2021, 10:21 AM IST

హైదరాబాద్ వనస్థలిపురం సీఐ మురళీమోహన్‌ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం... తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ కమ్మగూడలోని రాజ్‌రంజిత్‌ ప్రైమ్‌ హోమ్స్‌ కాలనీకి చెందిన దేవరకద్ర నరేందర్‌గౌడ్‌ కుమార్తె మనస్విని(29) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు. సహోద్యోగి నరేందర్‌తో ప్రేమలో పడింది. అప్పటికే అతనికి పెళ్లైంది.

భార్యకు విడాకులు ఇచ్చి తనను పెళ్లిచేసుకుంటానని మనస్వినితో చెప్పాడు. ఈ విషయం తెలిసి ఏడాది క్రితం యువతిని ఉద్యోగం మాన్పించారు. ఈ విషయంపై మనస్థాపం చెందిన ఆమె సంక్రాంతి నాడు గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని ఉరేసుకుని మృతి చెందింది.

ABOUT THE AUTHOR

...view details