తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నాలుగేళ్లు ప్రేమించుకున్నారు... కానీ పెళ్లికి నో! - మహబూబాబాద్ జిల్లా వార్తలు

నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని కలిసి తిరిగారు. కట్​ చేస్తే వివాహం అనగానే ఆ యువకుడు మొహం చాటేశాడు. చిరవకు మోసపోయనని గ్రహించిన యువతి... ప్రియుని ఇంటి ముందు ధర్నాకి దిగింది.

young woman protest at lover home in mahabubabad
నాలుగేళ్లు ప్రేమించుకున్నారు. కానీ పెళ్లికి నో!

By

Published : Nov 29, 2020, 8:42 AM IST

ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో... ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది ఓ ప్రియురాలు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ్య తండాకి చెందిన ఓ యువతి అదే తండాకు చెందిన సంతోశ్​లు 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మంచి సంతోశ్ మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. వివాహం చేసుకోవాలని బాధితురాలు నిలదీయగా... సంతోశ్ నిరాకరించడంతో అతని ఇంటి ముందు ఆందోళన చేపట్టింది.

సంతోశ్ బంధువులు కొందరు తనపై దాడి చేశారని ఆరోపించింది. అతని తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. ఆగ్రహించిన స్థానికులు రహదారిపై ముళ్ల కంచె వేసి ఆందోళనకు దిగారు.

"పెళ్లి చేసుకుంటానని సంతోశ్ నమ్మించాడు. అన్ని రకాలుగా మోసం చేశాడు. వివాహం కోసం నిలదీస్తే ఆయన తల్లిదండ్రులు ఒప్పు కోవడం లేదని అంటున్నాడు. అతని​తో పెళ్లి జరిపించి న్యాయం చేయాలి."

-బాధితురాలు

నాలుగేళ్లు ప్రేమించుకున్నారు. కానీ పెళ్లికి నో!

ఇదీ చదవండి:అక్రమంగా తరలిస్తున్న అర కిలో బంగారం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details