తహసీల్దార్ కార్యాలయంలో యువతి ఆత్మహత్యాయత్నం - palvancha latest news
15:29 December 05
తహసీల్దార్ కార్యాలయంలో యువతి ఆత్మహత్యాయత్నం
భద్రాద్రి జిల్లా పాల్వంచ తహసీల్దార్ కార్యాలయంలో ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. గ్రామానికి చెందిన భూక్యా జ్యోతికి చెందిన స్థల వివాదంలో తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడింది.
స్థల వివాదం విషయంలో ఇరువర్గాలను చర్చకు తహసీల్దార్ పిలవగా... ఆయన సమక్షంలోనే ప్రత్యర్థివర్గం వారు దాడి చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరగట్లేదన్న మనస్తాపంతో కార్యాలయంలోని ఫ్యాన్‌కు ఊరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అక్కడే ఉన్న స్థానికులు స్పందిచి యువతిని అడ్డుకున్నారు.