తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'నాకు అన్యాయం జరిగింది... నేను చచ్చిపోతా' - నాయుడుపేటలో సెల్ టవర్ ఎక్కిన యువకుడి వార్తలు

రెండు కుటుంబాల మధ్య జరిగిన వివాదంలో తనకు న్యాయం జరగలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగింది.

young-person-climb-a-cell-tower-in-naidupet-nellore-district
'నాకు అన్యాయం జరిగింది... నేను చచ్చిపోతా'

By

Published : Oct 7, 2020, 7:18 PM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేట రైల్వే స్టేషన్ ఆవరణలో ఓ యువకుడు సెల్ టవర్​పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన గొడవలో పోలీసులు తనకు న్యాయం చేయలేదన్న కారణంతో టవర్ ఎక్కి దూకేస్తానని బెదిరించాడు.

సమాచారం అందుకున్న సీఐ వేణుగోపాల్ రెడ్డి... ఘటన స్థలానికి చేరుకుని యువకుడికి న్యాయం చేస్తామన్నారు. సీఐ ఇచ్చిన హామీతో యువకుడు టవర్ దిగి వచ్చాడు.

ఇవీ చదవండి:అత్తమామల వేధింపులతో వివాహితుడు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details