హైదరాబాద్ అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో కొందరు యువకులు హల్చల్ చేస్తున్నారు. గంజాయి మత్తులో దారిలో వచ్చిపోయే వారిని రాళ్లతో దాడి చేసి గాయపరుస్తూ... వారి వద్ద నుంచి డబ్బులు, సెల్ ఫోన్లు, విలువైన వస్తువులు దోచుకుంటున్నారు. రాత్రి అయితే చాలు రోడ్డున వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. వీరి ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నా... పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
గంజాయి మత్తులో యువకుల హల్చల్ - హైదరాబాద్ గంజాయి వార్తలు
హైదరాబాద్ అంబర్పేటలో యువత గంజాయి మత్తులో ఊగిపోతున్నారు. దారిలో వచ్చిపోయే వారిని దోచుకుంటూ... హల్చల్ చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
గంజాయి మత్తులో యువకుల హల్చల్
ఆగడాలకు పాల్పడుతున్న వారిలో మైనర్లు ఉంటే వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నామని పోలీసులు తెలిపారు. యువకుల చర్యలపై నిఘా ఉంచుతామని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి :నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత ఘన విజయం