సూర్యాపేట జిల్లా తిరుమల గిరి మండలం వెలిశాల గ్రామానికి చెందిన సాయికుమార్ అతని మిత్రులు పక్క గ్రామంలోని స్నేహితుడి పుట్టిన రోజుకు వెళ్లారు. ఫంక్షన్ అయిపోయి తిరిగి వస్తుండగా దారి మధ్యలో ఆగి ఉన్న అదే గ్రామానికి చెందిన ప్రసాద్ వాహనం పక్క నుంచి వెళ్లే క్రమంలో ఢీ కొట్టారు. దీనితో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొంత సేపటి తరువాత ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.
యువకుల మధ్య గొడవ.. ఒకరిపై కత్తితో దాడి
దారి పక్కనుంచి వెళ్లే క్రమంలో ఒక బైక్ మరో ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దానితో యువకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఘర్షణ సద్దుమనిగింది. కానీ మధ్యలో మరో వ్యక్తి ప్రమేయంతో ఆ గొడవ చిలికి చిలికి గాలివానగా మారి కత్తిపోట్ల వరకు దారి తీసింది. ఆదివారం అర్ధరాత్రి సూర్యాపేట జిల్లా వెలిశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇదిలా ఉండగా స్థానిక వార్డు సభ్యుడు దండిగ కరుణాకర్ ప్రసాద్‌ను పిలిచి మాట్లాడాడు. దానితో గొడవ పెరిగి పెద్దదైంది. అది మనసులో పెట్టుకుని ప్రసాద్ అతని అనుచరులతో కలిసి సాయికుమార్‌పై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర రక్తస్రావం కావడం వల్ల అతన్ని స్థానికులు సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సలహామేరకు మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించారు. బాధితుడి వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బి.డానియోల్ కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి:షేర్‌చాట్‌లో వీడియో తీస్తుండగా ప్రమాదం... చంపేసి కిడ్నాప్ డ్రామా ఆడిన నిందితుడు