తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సెల్ఫీ దిగేందుకు వెళ్లి... వాగు ఉద్ధృతిలో బలి - దుందుభి వాగులో యువకుడు గల్లంతు

ఏళ్ల తర్వాత వాగు నిండుగా ప్రవహించడాన్ని చూసేందుకు జనాలు గుంపులుగా తరలివచ్చారు. కొందరు యువకులు ఉత్సాహంతో అందులో ఈత కొడుతూ సెల్పీలు దిగారు. ఓ యువకుడు సైతం సెల్ఫీ దిగేందుకు యత్నించి వాగు ఉద్ధృతికి బలయ్యాడు. ఈ ఘటన మహబూబ్​నగర్​ జిల్లాలోని లింగంపేట సమీపంలోని దుందుభి వాగులో చోటుచేసుకుంది.

young man washed out in dundubhi river at lingampet
young man washed out in dundubhi river at lingampet

By

Published : Sep 19, 2020, 5:23 PM IST

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం లింగంపేట గ్రామ సమీపంలోని దుందుభి వాగులో విషాదం చోటుచేసుకుంది. ఏళ్ల తరువాత నిండుగా ప్రవహిస్తోన్న దుందుభి వాగును చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వాగులో ఈత కొడుతూ... సరదాగా సెల్ఫీలు దిగుతున్నారు. ఈ క్రమంలోనే... అఫ్రోజ్​ అనే 22 ఏళ్ల యువకుడు ఈత కొడుతూ సెల్ఫీ దిగేందుకు యత్నించాడు. ప్రమాద వాశాత్తు నీటిలో పడిపోయాడు. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం వల్ల అందరూ చూస్తుండగానే... అఫ్రోజ్​ కొట్టుకుపోయాడు.

గల్లంతుకు ముందు...
గల్లంతుకు ముందు...

స్థానికులు స్పందించి కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. సమాచారం తెలిసి అధికారులు సైతం సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా శ్రమించినా.... ప్రయోజనం లేకుండా పోయింది. ఎంత వెతికినా వాగు ఉద్ధృతికి అఫ్రోజ్​ కన్పించలేదు. ఈ క్రమంలో... ప్రజలెవ్వరూ వాగు వద్దకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

మృతుడు అఫ్రోజ్​(ఫైల్​)

ఇదీ చూడండి:చేపల వేటకు వెళ్లి.. నీట మునిగి వృద్ధుడు మృతి

ABOUT THE AUTHOR

...view details