కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయిన ఓ యువకుడు మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగరాజు (20) ఇంటర్ పూర్తి చేసి రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. తాజాగా బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లొచ్చాడు.
కరోనా సోకిందని యువకుడి ఆత్మహత్య - nallbelli news
వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో విషాదం చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిందన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు.
కరోనా సోకిందన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య
వచ్చిన నాలుగు రోజుల తర్వాత జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు రావటం వల్ల అనుమానంతో కరోనా పరీక్ష చేయించుకున్నాడు. తీరా ఫలితాల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. వైరస్ సోకిందని తీవ్ర మనస్తాపానికి గురైన నాగరాజు... ఇంట్లో ఎవరూలేని సమయంలో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి దూడయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.