గుర్తు తెలియని రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన... వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట్ మండలం రాంపూర్, మడికొండ రైల్వేలైన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామానికి చెందిన శివసాయి అనే యువకుడు డిగ్రీ చదువుతూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఉద్యోగం రాలేదని రైలుకింద పడి యువకుడు ఆత్మహత్య - రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య
వరంగల్ అర్బన్ కాజీపేట మండల పరిధిలో రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్యోగం రాలేదని మనస్థాపంతో మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.

ఉద్యోగం రాలేదని రైలుకింద పడి యువకుడు ఆత్మహత్య
ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ తనకు ఉద్యోగం రావడం లేదనే మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు అతని కుటుంబ సభ్యులు తెలిపారని రైల్వే పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై జితేందర్ రెడ్డి వెల్లడించారు.