తల్లిదండ్రులు లేరనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్టలో జరిగింది. కామారెడ్డి జిల్లా తాడ్వాయికి చెందిన హరీశ్ రెడ్డి తల్లిదండ్రులు చనిపోయారు. అతను గత కొంతకాలంగా మహాదేవపురంలో స్నేహితుడు అభినయ్తో కలిసి ఉంటూ... ఓ బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్నాడు.
విషాదం: అమ్మనాన్న లేరని యువకుడి ఆత్మహత్య - తెలంగాణ వార్తలు
అమ్మనాన్నల మరణం ఆ యువకుడిని తీవ్ర మానసిక క్షోభకు గురి చేసింది. బ్యాంక్ ఉద్యోగం చేస్తూ బతుకుతున్నా తనకు ఎవరూ లేరంటూ తరచూ మనోవేదనకు గురయ్యేవాడు. మనస్తాపంతో చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన జగద్గిరిగుట్టలో జరిగింది.
![విషాదం: అమ్మనాన్న లేరని యువకుడి ఆత్మహత్య young-man-suicide-at-jagadgirigutta-in-medchal-malkajgiri-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10565278-1000-10565278-1612919877095.jpg)
విషాదం: అమ్మనాన్న లేరని యువకుడు ఆత్మహత్య
ఈ క్రమంలో స్నేహితుడు అభినయ్ ఉద్యోగానికి వెళ్లగా హరీశ్ సోమవారం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాయంత్రం వచ్చిన అభినయ్ గదిలో స్నేహితుడు ఉరి వేసుకుని ఉండడాన్ని చూసి అతని పెద్దనాన్నకు సమాచారం అందించగా... వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపారు.తనకు ఎవరూ లేరని తరుచూ బాధపడుతూ ఉండేవాడని అతని స్నేహితుడు తెలిపారు.
ఇదీ చదవండి:ఆరేళ్ల బాలికపై హత్యాచార నిందితుడికి ఉరిశిక్ష