సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నెలరోజుల్లోనే గొర్రెల వరుస మరణంతో మనస్థాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
వారం రోజుల్లో పెళ్లి... యువకుడు బలవన్మరణం - సిద్దిపేట జిల్లా క్రైం న్యూస్
వారం రోజుల్లో తమ కుమారుని పెళ్లి వైభవంగా చేయాలనుకున్న ఆ తల్లిదండ్రులకు గర్భశోకమే మిగిలింది. తమ కొడుకుని వరునిగా చూడాలనుకున్న వారికి... విగత జీవిగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ హృదయవిదారక ఘటనతో సిద్దిపేట జిల్లా గుండవెల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వారం రోజుల్లో పెళ్లి... యువకుడు బలవన్మరణం
పెద్ద గుండవెల్లి గ్రామానికి చెందిన రాజు తన ఇంటి పక్కనే ఉన్న గొర్రెల షెడ్డులో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నెలరోజులుగా అరవై గొర్రెలు మృత్యువాత పడడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు తెలిపారు. ఈనెల 18న రాజు వివాహం జరగాల్సి ఉండగా... ఇంతలోనే ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండి:వైద్యసిబ్బంది నిర్లక్ష్యం... పురిట్లోనే పసికందు మృతి