తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చెప్పుతో కొట్టిన సర్పంచ్... మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య - young man sucide news

జనగామ జిల్లా కూసుంబాయి తండాలో ఓ యువకుడు ఆత్యహత్యకు పాల్పడ్డాడు. సర్పంచ్ తనను చెప్పుతో కొట్టాడాని మనస్తాపం చెంది పురుగుల మందు తాగి బలవన్మరణానికి ఒడిగట్టాడు.

చెప్పుతో కొట్టిన సర్పంచ్... మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య
చెప్పుతో కొట్టిన సర్పంచ్... మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

By

Published : Sep 7, 2020, 4:35 PM IST

సర్పంచ్ చెప్పుతో కొట్టడాని మనస్తాపం చెంది ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. కూసుంబాయి తండాకు చెందిన గుగులోతు ఎల్లేష్ ను.. ఆదివారం రాత్రి సర్పంచ్ ధారవత్ రమేశ్ చెప్పుతో కొట్టి తిట్టాడు. ఈ అవమానం భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడని.. మృతుని భార్య సుగుణ తెలిపింది.

గ్రామంలో వీధి లైట్స్ వేసే విషయంలో తన భర్తకు సర్పంచ్ రమేష్ కు గొడవ రాగా... సర్పంచ్ చెప్పుతో కొట్టి తిట్టడం వల్ల అవమానం భరించలేక పురుగుల మందు తాగినట్లు తెలిపింది.

వెంటనే జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొంది. ఈ మేరకు మండల కేంద్రానికి తరలివచ్చిన గ్రామస్థులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి సర్పంచ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details