శంషాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. బాలికను బెదిరించి ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గోపి శంషాబాద్‌లో ఉంటున్నాడు. స్థానికంగా నివాసముండే బాలికను నా దగ్గర గన్ ఉందని బెదిరించాడు. నీ తల్లిదండ్రులను కాల్చేస్తానంటూ పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ ఘటన దృశ్యాలను సెల్ఫోన్లో రికార్డు చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెపితే... చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
గన్‌తో బెదిరించి... అత్యాచారం చేసి... రికార్డు చేశాడు - మైనర్‌పై అత్యాచారం
ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా... ఎన్ని ఆందోళలనలు జరిగినా... సమాజంలో అత్యాచారాలు మాత్రం ఆగడంలేదు. అప్పుడే పుట్టిన పసికందు నుంచి వృద్ధురాలిని కూడా వదలట్లేదు ఈ మృగాలు. బాలికను బెదిరించి... అఘాయిత్యానికి పాల్పడి... ఆ దృశ్యాలను సెల్ఫోన్లో రికార్డు చేశాడు ఓ కామాంధుడు.
గన్‌తో బెదిరించి... అత్యాచారం చేసి... రికార్డు చేశాడు
భయపడిన బాలిక విషయాన్ని ఎవరికి చెప్పలేకపోయింది. అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా... ఈ ఘటన వెలుగుచూసింది. అనంతరం ఫిర్యాదు చేయగా... పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి:'భార్యపై.. స్నేహితులతో కలిసి భర్త సామూహిక అత్యాచారం'