జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం భీమారంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకల్లో కొందరు యువకులు ఘర్షణ పడ్డారు. వాగ్వాదం క్రమంగా పెరిగి ఊరేగింపు అనంతరం పూదరి లక్ష్మణ్ అనే యువకున్ని అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు కత్తితో పొడిచి హత్య చేశారు.
పెళ్లి వేడుకల్లో ఘర్షణ... యువకుడి హత్య - జగిత్యాల జిల్లా తాజా వార్తలు
పెళ్లి వేడుకల్లో చోటు చేసుకున్న ఘర్షణ ఓ యువకుడి ప్రాణాలు బలిగింది. ఊరేగింపులో జరిగిన వాగ్వాదం క్రమంగా పెరిగి యువకుడి హత్యకు దారి తీసింది. ఆవేశంతో ముగ్గురు వ్యక్తులు కలిసి పూదరి లక్ష్మణ్ అనే వ్యక్తిని కత్తితో పొడిచారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పెళ్లి వేడుకల్లో ఘర్షణ... యువకుడి హత్య
యువకుడి హత్యతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కోరుట్ల సీఐ రాజశేఖర రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:పెద్దలు అంగీకరించలేదని... ప్రేమజంట ఆత్మహత్య