ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. కరుణా కాలనీకి చెందిన పసుమర్తి థామస్ అనే యువకుడు కుటుంబ పోషణ కోసం పాల ప్యాకెట్లు వేసేవాడు. అనంతరం ఓ షాపింగ్ మాల్లో పని చేసేవాడు. అదే షాపింగ్ మాల్లో పనిచేసే ఓ మహిళతో అతనికి స్వల్ప వివాదం తలెత్తింది. ఆ గొడవను ఆమె తన భర్త జోసఫ్‌కు చెప్పింది. దాంతో జోసఫ్ యువకునిపై కోపం పెంచుకున్నాడు. భార్యతో అతనికి పోన్ చేయించి గాంధీ పార్క్ వద్దకు రప్పించారు.
పట్టపగలు నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య - ప్రకాశం జిల్లా వార్తలు
ఆ యువకుడు తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు. అతనికి ముగ్గురు అక్కాచెల్లెళ్లు. వారిది నిరుపేద కుటుంబం. తండ్రి అనారోగ్యంతో మంచాన పడ్డాడు. దాంతో ఇంటి బాధ్యతను నెత్తిన వేసుకున్నాడు. రాత్రింబవళ్లు కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కానీ ఓ చిన్న గొడవ అతని ప్రాణాలను తీసింది. కుటుంబాన్ని కన్నీటి సంద్రంలో ముంచింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జరిగింది.
ఒంగోలులో యువకుడు దారుణ హత్య
గొడవ విషయం మాట్లాడుతూ థామస్‌ను కత్తితో దారుణంగా పొడిచాడు. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం కత్తితోపాటు నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.