తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఇంట్లో వాళ్లు పెళ్లి చేయట్లేదని పారిపోయాడు! - telangana latest news

ఇంట్లో వాళ్లు వివాహం చేయడం లేదని యువకుడు అదృశ్యమైన ఘటన హైదరాబాద్ చిలకలగూడా పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు ప్రారంభించారు.

ఇంట్లో వాళ్లు పెళ్లి చేయట్లేదని అదృశ్యమయ్యాడు..
ఇంట్లో వాళ్లు పెళ్లి చేయట్లేదని అదృశ్యమయ్యాడు..

By

Published : Jan 4, 2021, 12:18 PM IST

హైదరాబాద్​లోని చిలకలగూడా తరుణిసూపర్​ మార్కెట్ సమీపంలో నివాసముంటున్న సాయి విష్ణు అదృశ్యమయ్యాడు. గత రెండు నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు... కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయి విష్ణుకు మతి స్థిమితం సరిగా లేనట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు ప్రారంభించారు.

మహమ్మద్​గూడలోని బీరువాలు తయారుచేసే... కర్మాగారంలో విష్ణు పని చేస్తున్నాడు. విష్ణుకి ఇంట్లో వాళ్లు పెళ్లి చేయడంలేదనే మనస్తాపంతోనే వెళ్లిపోయినట్లు విచారణలో తేలింది. యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి:వ్యవసాయ భూమిలో విద్యుదాఘాతం.. రైతు మృతి

ABOUT THE AUTHOR

...view details