ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ తగాదాలు తాళలేక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం అర్థరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయిన అరుణ్‌కుమార్ పట్టణంలోని రైలు పట్టాలపై పడుకుని ఇవాళ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆర్థిక ఇబ్బందులు తాళలేక బలవన్మరణం - తెలంగాణ వార్తలు
తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు అరుణ్‌కుమార్. ఆరు నెలల క్రితమే వివాహం అయింది. ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. కుటుంబ తగాదాలు పెరిగాయి. ప్రసవం కోసం భార్య పుట్టింటికి వెళ్లింది. తన కష్టాలకు చావే పరిష్కారం అనుకున్నాడో ఏమో.. రైలు పట్టాలపై పడుకుని ప్రాణాలొదిలాడు.
ఆర్థిక ఇబ్బందులు తాళలేక బలవన్మరణం
జహీరాబాద్ నాగులకట్టకు చెందిన అరుణ్‌కుమార్(21) తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. ఆరు నెలల క్రితమే వివాహం అయింది. ఇటీవల భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది. ఇవాళ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: బాలిక మైనర్... కులాలు వేరు... ప్రేమజంట ఆత్మహత్య!