నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో విషాదం చోటుచేసుకుంది. కుమ్మరివాడ పాతబజార్‌కు చెందిన పూల వ్యాపారి మహబూబ్ అలీ పెద్ద కుమారుడు అజీమ్(19) ఇంటర్ చదువుతున్నాడు.
విషాదం: చేపల వేటకు వెళ్లి... శవమై తిరిగొచ్చాడు - Nagar Kurnool District Crime News
చేపల వేటకు వెళ్లి వాగులో జారిపడి యువకుడు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కళాశాలలు లేకపోవడం వల్ల ఖాళీగా ఉన్న అజీమ్ తన చిన్న తమ్ముడు, బావమరిదితో కలిసి ముగ్గురు ఉప్పనుంతల మండలం మొల్గర సమీపంలోని ఓ వాగులోకి చేపల వేటకు వెళ్లారు. అయితే అజీమ్‌కు ఈత వచ్చినప్పటికీ వాగు ప్రవాహానికి గుంతలో పడి మునిగిపోయాడు. తనతో పాటు తన తమ్ముడు, బావమరిది కాపాడాలని యత్నించారు. అయినప్పటికీ అజీమ్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: ఆధ్యాత్మిక ప్రదేశాలు తెరవాలంటూ సుప్రీంలో వ్యాజ్యం