తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ప్రాజెక్టు సందర్శనకు వెళ్లి... గంగమ్మ ఒడిలోకి... - jaheerabad news

సరదాగా ప్రాజెక్టు చూసొద్దామని వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు కాలుజారి అందులోనే పడిపోయాడు. మృతదేహాం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నారింజ ప్రాజెక్టు వద్ద జరిగింది.

young man drown in narinja project at jaheerabad
young man drown in narinja project at jaheerabad

By

Published : Oct 15, 2020, 11:01 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నారింజ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందాడు. జహీరాబాద్ పట్టణంలోని బందెల్లి కాలనీకి చెందిన మాజిద్(25) కొత్తూరు(బి)లోని నారింజ ప్రాజెక్టును చూసేందుకు వెళ్లాడు. ఏడో నంబర్ గేటు వద్ద ప్రమాదవశాత్తు కాలుజారి... గేట్ల వెనకవైపు పడిపోయి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ప్రాజెక్టు సందర్శనకు వెళ్లి... గంగమ్మ ఒడిలోకి...

మృతదేహం కోసం ప్రాజెక్టులో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు గాలించినా... మృతదేహం లభ్యం కాలేదు. తిరిగి శుక్రవారం గాలింపు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాజెక్టు వద్దకు వచ్చే సందర్శకులు స్వీయ నియంత్రణ పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని పోలీసులు, జలవనరుల శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: వంతెనపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details