తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తేలు కాటుతో యువకుడు మృతి - తేలు కాటుకు గురైన యువకుడు

తేలు కాటుకు గురై యువుడు మృతి చెందిన ఘటన... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారంలో చోటుచేసుకుంది. సెట్రింగ్​ కర్రల్ని తీస్తుండగా... తేలు కరిచింది. ఖమ్మంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

young man died with Scorpio bite in anantharam badradri kothagudem district
తేలు కాటుతో యువకుడు మృతి

By

Published : Jun 25, 2020, 9:27 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారం గ్రామంలో తేలు కాటుకు గురై శ్రీరామ్ రాణా ప్రతాప్(28) అనే యువకుడు మృతి చెందాడు. ములుగు జిల్లా మంగపేట మండలం అకినేపల్లి మల్లారంలో సెంట్రింగ్​ కర్రల్ని తీసుకొచ్చేందుకు వెళ్లాడు. కర్రలు తీస్తుండగా... తేలు కరిచింది. వెంటనే స్థానికులు జానంపేట ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం భద్రచాలం ఆ తర్వాత ఖమ్మం తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాణా ప్రతాప్​ తుదిశ్వాస విడిచాడు. చేతికందిన కొడుకు మృతితో తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతంగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details