జోగులాంబ గద్వాల జిల్లా చెనుగోనిపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడు ద్విచక్రవాహనంపై హైదరాబాద్‌కు వెళ్తున్నాడు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం వద్ద హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. అతివేగంతో ఉండటం వల్ల బైక్ లారీలోకి చొచ్చుకు పోయింది. తీవ్ర గాయాలు అయినందున అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేందర్ రెడ్డి తెలిపారు.
లారీని ఢీకొన్న ద్విచక్రవాహనం.. యువకుడు మృతి - రంగాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రశాంత్ మృతి
ముందు వెళ్తున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
![లారీని ఢీకొన్న ద్విచక్రవాహనం.. యువకుడు మృతి young-man-died-in-a-road-accident-at-rangapuram-village-pebbair-mandal-wanaparthy-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7804889-92-7804889-1593337356844.jpg)
లారీని ఢీకొన్న ద్విచక్రవాహనం.. యువకుడు మృతి