మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్ మండలం బొమ్మరాశిపేటలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై శ్రీపాల్ రెడ్డి అనే యువ రైతు మృతి చెందాడు.
గ్రామానికి చెందిన మెడసాని శ్రీపాల్ రెడ్డి గేదెల కోసం తన పొలంలో గడ్డి కోయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో గట్టుపై తెగి పడి ఉన్న విద్యుత్ తీగలకు ప్రమాదవశాత్తు తగలడంతో విద్యుత్ షాక్కు గురయ్యాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు.