తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఇసుక ట్రాక్టర్​ ట్రాలీ మీద పడి యువకుడి దుర్మరణం - ప్రమాదవశాత్తు యువకుడి మృతి సూర్యాపేట జిల్లా

ఇసుక ట్రాక్టర్ ట్రాలీ ప్రమాదవశాత్తు మీద పడడం వల్ల యువకుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో చోటుచేసుకుంది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బి. డానియేల్ కుమార్ తెలిపారు.

ఇసుక ట్రాక్టర్​ ట్రాలీ మీద పడి యువకుడి దుర్మరణం
ఇసుక ట్రాక్టర్​ ట్రాలీ మీద పడి యువకుడి దుర్మరణం

By

Published : Nov 22, 2020, 12:13 AM IST

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం నుంచి వెలిశాలకు కారుపోతుల వినయ్ ఇసుక రవాణా చేస్తుండగా... గ్రామ సమీపంలో ట్రాక్టర్ టైర్ పంక్చర్​ అయింది. టైర్ మార్చేందుకు వినయ్ స్నేహితుడు అదే గ్రామానికి చెందిన గొడిశాల సాయిలు, గొడిశాల కొమిరెల్లి(20)ని తీసుకొని వెళ్లాడు.

ఇసుక ట్రాక్టర్​ ట్రాలీ మీద పడి యువకుడి దుర్మరణం

టైర్ మార్చే క్రమంలో ట్రాలీను జాకీ సహాయంతో ఎక్కించేందుకు ప్రయత్నిస్తుండగా... కొమిరెల్లిపై ట్రాలీ పడింది. దీంతో అక్కడిక్కడే కొమిరెల్లి మృతి చెందాడు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బి. డానియేల్ కుమార్ తెలిపారు.

ఇదీ చదవండి:అమ్మ ప్రేమ మరిచి... కన్నబిడ్డను అమ్ముకుంది..!

ABOUT THE AUTHOR

...view details