జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వేర్వేరు ఘటనల్లో ఓ యువకుడు మృతి చెందగా... ముగ్గురు గల్లంతయ్యారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని... నలుగురు యువకులు పుణ్యస్నానాలకు వెళ్లారు. ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి తుంగల శ్రీశైలం అనే యువకుడు మృతి చెందాడు.
గోదావరిలో యువకుడు మృతి.. ముగ్గురు గల్లంతు - వ్యక్తి మృతి ముగ్గురు గల్లంతు
తొలి ఏకాదశి పర్వదినాన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువకుడు మృతి చెందగా... ముగ్గురు గల్లంతయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
గోదావరిలో యువకుడు మృతి.. ముగ్గురు గల్లంతు
పలిమేల మండలం లెంకలగడ్డలో నదీ స్నానానికి వెళ్లిన తోట రవి (25), ఆకుల కార్తిక్ (22), ప్రదీప్ (21) గల్లంతయ్యారు. కాటారం డీఎస్పీ బి. కిషన్, సీఐ నర్సయ్య ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. కాళేశ్వరం నుంచి గజ ఈతగాళ్ల తీసుకొచ్చి గాలిస్తున్నారు. గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల మేడిగడ్డ బ్యారేజీ గేట్లు మూసివేశారు.
ఇదీ చూడండి:అక్రమంగా తరలిస్తున్న 110 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం