సికింద్రాబాద్లోని జవహర్ నగర్ పరిధి భవాని నగర్లో నివాసముంటున్న వెంకన్న అనే యువకుడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం రాత్రి మద్యం సేవించి... ఓ వివాహితతో గొడవ పడ్డాడు. ఈ ఘటనతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
వివాహితతో గొడవపడ్డాడు... మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు - యువకుడు ఆత్మహత్య వార్తలు
బుధవారం రాత్రి మద్యం మత్తులో వివాహితతో జరిగిన గొడవకు మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్లో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
విషయం తెలుసుకున్న యువకుడి కుటుంబ సభ్యులు వివాహిత ఇంటి ముందు ఆందోళన చేశారు. ఆమెతో వివాహేతర సంబంధం ఉందని... అందుకే వెంకన్న చనిపోయాడని వారు ఆరోపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మృతదేహాన్ని ఆమె ఇంటి ముందే ఉంచారు. అనంతరం పోలీసులు కుటుంబసభ్యులను వారించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలను సేకరించారు. సూసైడ్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వివాహితను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదీ చూడండి:తండ్రి చదువుకోమన్నాడని... ఆత్మహత్య చేసుకుంది