జీవితంపై విరక్తితో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటర్ పరీక్షల సందర్భంగా ద్విచక్రవాహన ప్రమాదానికి గురై కిడ్నీ సమస్యతో బాధపడుతూ బతుకు భారమై ఆత్మహత్యాయత్నం చేశాడు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన బోర రాజు అనే యువకుడు పురుగుల మందు తాగి శనివారం అపస్మారక స్థితికి వెళ్లాడు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
జీవితంపై విరక్తి... యువకుడి ఆత్మహత్య - తెలంగాణ
సూర్యాపేట జిల్లా మాచనపల్లిలో విషాదం చోటు చేసుకుంది. బతుకు భారమై పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతకొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధ పడుతూ జీవితంపై విరక్తితో ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితికి వెళ్లిన యువకుడు హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

జీవితంపై విరక్తి... యువకుడి ఆత్మహత్య
మృతుని తండ్రి బోర ఉప్పలయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శవ పరీక్ష కోసం తుంగతుర్తి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
ఇదీ చదవండి:లైవ్ వీడియా: దొంగలు వచ్చి బెదిరించి దోచుకెళ్లారు