కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం ముత్తయికోట గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బ్రహ్మం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు.
శుక్రవారం రాత్రి మనస్తాపానికి గురై గ్రామ శివారులో ఉన్న బ్రాహ్మణ చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి చిన్నసిద్దయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య రవళి, తొమ్మిది నెలల కుమార్తె ఉంది.
కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య - యువకుడు ఆత్మహత్య
కుటుంబ కలహాలతో యువకుడు చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా ముత్తయికోట గ్రామంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య
ఇవీ చూడండి: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య