సైబారాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ యువకుడు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని హైదర్ షాకోట్ ఓయో హోటల్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
హోటల్లో యువకుడి ఆత్మహత్య... పోలీసుల ఆరా - నార్సింగిలోని ఓయో హోటల్లో యువకుడు బలవన్మరణం
రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్ పరిధిలోని ఓ హోటల్లో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు. స్నేహితులతో కలిసి ఇక్కడకు వచ్చాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
హోటల్లో యువకుడి ఆత్మహత్య...ఆరా తీస్తున్న పోలీసులు
సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఒక్కడే వచ్చారా...స్నేహితులతో కలిసి వచ్చారా అన్నకోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హోటల్ మేనేజర్, సిబ్బందిని ప్రశ్నించిన పోలీసులు సీసీటీవీల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.