వ్యక్తిని దారుణంగా నరికి చంపి గోనె సంచిలో మూటగట్టి చెక్‌డ్యాంలో పారవేసిన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం బసంత్‌పూర్‌లో చోటు చేసుకుంది. 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి తల, కాళ్లు, చేతులను క్రూరంగా నరికి గోనెసంచిలో కుక్కి నీళ్లలో పార వేసినట్లు సమాచారం రావడంతో హద్నూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు.
దారుణ హత్య: మొండెం, తల, కాళ్లు, చేతులు వేరుచేసి.. - telangana varthalu
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం బసంత్‌పూర్‌లో దారుణ హత్య జరిగింది. గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు అతి కిరాతకంగా హతమార్చి మొండెం నుంచి తల, కాళ్లు,చేతులను వేరుచేసి గోనెసంచిలో కుక్కి వాగులో పడేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
దారుణ హత్య: మొండెం, తల, కాళ్లు, చేతులు వేరుచేసి..
హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు శవాన్ని పరీక్షల నిమిత్తం జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: వ్యవసాయ బావిలో తేలిన పిల్లల మృతదేహాలు