తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రామడుగు ప్రాజెక్టులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం - Nizamabad crime news

నిజామాబాద్ జిల్లా రామడుగు ప్రాజెక్టులో స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్లు గాలించగా ఇవాళ మృతదేహం లభ్యమైంది.

రామడుగు ప్రాజెక్టులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
రామడుగు ప్రాజెక్టులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

By

Published : Sep 28, 2020, 12:24 PM IST

నిజామాబాద్ జిల్లా రామడుగు ప్రాజెక్టులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. డిచ్​పల్లి మండలం సుద్దపల్లికి చెందిన నవీన్ రెడ్డి... ఆదివారం స్నేహితులతో కలిసి రామడుగు ప్రాజెక్ట్​లో స్నానానికి వెళ్లి.. గల్లంతయ్యాడు. స్నేహితుల సమాచారం మేరకు అగ్నిమాపక శాఖ, పోలీసు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడడం, ప్రవాహ వేగం అధికంగా ఉండడం వల్ల ఆదివారం జాడ లభించలేదు.

సోమవారం ఉదయం గజ ఈతగాళ్లను రప్పించి గాలించగా మృతదేహం లభ్యమైంది. మృతుడు 25 రోజుల క్రితమే గల్ఫ్ నుంచి వచ్చి గృహ నిర్బంధంలో ఉన్నాడని, స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లగా మృత్యువు కబళించిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ఇదీ చూడండి ఆచరణలో లేని ముఖ్యమంత్రి మాట: వీహెచ్

ABOUT THE AUTHOR

...view details