కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గుండి గ్రామంలో ఇద్దరు వ్యక్తులపై పాత కక్షలతో ఒక యువకుడు కత్తితో దాడికి దిగాడు. గ్రామానికి చెందిన రమేష్, సతీష్‌లు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. ఇంట్లో శుభకార్యం ఉండటంతో కుటుంబ సభ్యులంతా పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అదే సమయంలో గ్రామానికి చెందిన నగోష బల్వంత్‌రావు వీరిపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. బాధితులకు తీవ్ర రక్తస్రావం కావడంతో మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
పాత కక్షలతో దాడి.. చికిత్స పొందుతున్న బాధితులు - నేర వార్తలు
పాత కక్షలతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై ఓ యువకుడు దాడికి పాల్పడిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. తీవ్ర రక్తస్రావం కావడంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే ఈ దాడి చేశారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పాత కక్షలతో దాడి.. చికిత్స పొందుతున్న బాధితులు
కుటుంబ కలహాలతోనే అతను ఈ దాడి చేసి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:విమానాల్లో వస్తుంది.. చోరీ చేసి వెళ్తుంది..