ప్రేమకు నిరాకరించిందనే కారణంతో ఓ మైనర్ బాలికపై మైనర్ యువకుడు బీరు సీసాలతో దాడి చేసిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని లేబర్ కాలనీలో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు ప్రభాకర్. ఆయన కుమార్తె హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసి సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చింది. గత కొన్ని రోజులుగా ఆమె చిన్ననాటి స్నేహితుడు నిఖిల్... తనను ప్రేమించాలంటూ బలవంతం చేస్తున్నాడు.
ప్రేమకు నిరాకరించిందని.. బీరు సీసాలతో దాడి - warangal urban district crime news
ప్రేమకు నిరాకరించిందని మైనర్ బాలికపై బీరు సీసాతో దాడి
18:07 June 17
ప్రేమకు నిరాకరించిందని.. బీరు సీసాలతో దాడి
అతని ప్రేమను ఆ బాలిక ఒప్పుకోలేదు. ఫలితంగా ఆవేశానికి లోనైన యువకుడు బీరు సీసాతో ఆమెపై దాడి చేయగా బాలిక స్వల్పంగా గాయపడింది. గుర్తించిన స్థానికులు ఆ మైనర్ బాలికను హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. భుజంపై గాయం మాత్రమే అయినందున ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి:ప్రేమ పేరుతో వెంటపడ్డాడు.. మోజు తీరిన తర్వాత..?
Last Updated : Jun 17, 2020, 8:36 PM IST