ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని ఓ యువతి దిగువమానేరులోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. హైదరాబాద్ శంషాబాద్‌లో నివాసం ఉంటున్న బాధితురాలు... మూడేళ్ల కిందట కరీంనగర్‌లోని తన అత్తమ్మ ఇంట్లో ఉండేది. ఆ సమయంలో సవారన్ స్ట్రీట్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది.
ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని ఆత్మహత్యాయత్నం - Karimnagar crime news
కరీంనగర్ దిగువమానేరులో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని బలవన్మరణానికి యత్నించింది.
![ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని ఆత్మహత్యాయత్నం ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని ఆత్మహత్యాయత్నం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9434641-1092-9434641-1604515819948.jpg)
ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని ఆత్మహత్యాయత్నం
ఆ తర్వాత వారి కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఈ క్రమంలో యువతి కరీంనగర్‌కు చేరుకొని పెళ్లి చేసుకోవాలని ప్రియుడు ఆజంను వేడుకోగా అతను తిరస్కరించాడు. జీవితంపై విరక్తి చెందిన యువతి... దిగువమానేరులో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. గస్తీలో ఉన్న కానిస్టేబుళ్లు నరసింహారెడ్డి, అశోక్ ఆమెను నివారించారు. కౌన్సిలింగ్ నిర్వహించి వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. అనంతరం బంధువులకు సమాచారం అందించారు.
ఇదీ చూడండి:విజయశాంతితో భేటీ అయిన మాణికం ఠాగూర్