తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'అర్ధరాత్రి వేళ ఇంటి నుంచి యువతి అదృశ్యం' - telangana news

అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి యువతి అదృశ్యమైన ఘటన చిలకలగూడలో చోటుచేసుకుంది. అయితే ఆమె ఓ వ్యక్తితో చనువుగా ఉండేదని తల్లిదండ్రులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు.

young-lady-missing-in-secunderabad-chilkalguda
'అర్ధరాత్రి వేళ ఇంటి నుంచి యువతి అదృశ్యం'

By

Published : Feb 5, 2021, 7:52 PM IST

ఓ యువతి ఇంటినుంచి అర్ధరాత్రి సమయంలో అదృశ్యమైన సంఘటన సికింద్రాబాద్​లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చిలకలగూడలోని శ్రీనివాస్ నగర్​లో నివాసం ఉంటున్నయువతి అమీర్​పేట డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.

వాష్​రూమ్​కి అని చెప్పి..

ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో లాలాపేటకు చెందిన నాగరాజు అనే విద్యార్థితో ఫోన్​లో సంభాషిస్తూ చనువుగా ఉండేదని కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిన్న రాత్రి ఇంట్లో నుంచి వెళ్తుండగా.. ఆమె అత్త గమనించి అడగ్గా.. వాష్​రూమ్​కి వెళ్తున్నట్లు చెప్పింది. తరువాత ఆమె ఎంతసేపటికి తిరిగి రాకపోటంతో చుట్టు పక్కల వెతికారు.

బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీసినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. వెంటనే విషయాన్ని పోలీసులకు సమాచారం అందించగా... పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి:భార్యను మర్డర్ చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించి..

ABOUT THE AUTHOR

...view details