సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో ఓ యువతి అదృశ్యమైంది. చిట్కుల్ గ్రామ పరిథి వడ్డెర కాలనీకి చెందిన భగవతి... స్థానికంగా ఉన్న జీటీఎన్ పరిశ్రమలో విధులు నిర్వహిస్తోంది. ఈ నెల 13వ తేదీన ఉదయం ఐదున్నర గంటల సమయంలో పరిశ్రమలో విధులకు వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. సాయంత్రమైన ఇంటికి రాకపోవడం వల్ల.... ఆమె తండ్రి తెలిసిన వాళ్ల ఇళ్లతోపాటు బంధువుల ఇళ్లవద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు.
'పరిశ్రమలో పనికి వెళ్లింది... రెండురోజులైనా ఇంటికి రాలేదు' - Young lady Missing latest news
ఓ పరిశ్రమలో విధులు నిర్వహించేందుకు యువతి వెళ్లి అదృశ్యమైంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

sangareddy district latest news
రెండు రోజులైనప్పటికీ కూతురు ఇంటికి రాకపోవడం వల్ల భగవతి తండ్రి భద్రాచలం పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.