వికారాబాద్‌లో పంతొమ్మిదేళ్ల యువతి అపహరణ
19:45 September 27
వికారాబాద్‌లో పంతొమ్మిదేళ్ల యువతి అపహరణ
అందరూ చూస్తుండగానే యువతిని అపహరించిన ఘటన... వికారాబాద్ ఎంఆర్పీ చౌరస్తాలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన దీపిక, అఖిల్... 2016లో ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం దీపిక తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడం వల్ల రెండు సంవత్సరాల క్రితం ఇంటికి తీసుకొచ్చారు. అందులో భాగంగానే శనివారం నాడు ఇద్దరూ వికారాబాద్ కోర్టుకు హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం సోదరితో కలిసి షాపింగ్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా... భర్త, మరో ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి లాక్కొని వెళ్లినట్టు స్థానికంగా ఓ వ్యాపారస్థుడు తెలిపాడు.
దీపిక కుటుంబసభ్యులు వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ సంజీవరావు సిబ్బందితో ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ ముమ్మరం చేశారు. ఘటన జరిగిన పరిసరాల్లోని దుకాణాల్లో ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు వెల్లడించడానినికి పోలీసులు, కుటుంబసభ్యులు నిరాకరిస్తున్నారు.