విద్యుదాఘాతంతో యువ రైతు మృతి చెందిన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. బచ్చన్నపేట మండలంలోని పడమటి కేశవాపూర్ గ్రామానికి చెందిన బషీర్ (27).. శుక్రవారం ఉదయం తన వ్యవసాయ బావి దగ్గర మోటార్ ఆన్ చేశాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. బషీర్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
విద్యుదాఘాతంతో యువరైతు మృతి - young farmer died of electric shock in keshavapur
విద్యుదాఘాతంతో బషీర్ అనే యువరైతు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా పడమటి కేశవాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. బషీర్ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
విద్యుదాఘాతంతో యువరైతు మృతి
ఇదీ చదవండి: 20 రోజులుగా మృత్యువుతో పోరాడిన భారత జవాన్ మృతి