తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నీటిగుంతలో పడి యువకుడు మృతి - latest crime news in siddipeta

నీటిగుంతలో పడి యువకుడు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా ఇబ్రహీంనగర్​లో శివారులో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

young boy fall Water lame in siddipeta district
నీటిగుంతలో పడి యువకుడు మృతి

By

Published : Sep 6, 2020, 3:20 PM IST

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన రమేశ్ సిద్దిపేటలోని రిలయన్స్​ షోరూంలో పని చేస్తున్నాడు. పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఇబ్రహీంనగర్ శివారులోని కెనాల్ గుంతలో పడి మృతి చెందారు. మెగా కంపెనీ వారు కెనాల్ కాలువ కోసం రోడ్డు తవ్వి చుట్టూ ఏలాంటి సూచికలు పెట్టకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

రమేశ్​ మృతికి మెగా కంపెనీ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని మృతుడి బంధువులు ఆరోపించారు. కాలువ తవ్వినప్పుడు ఎలాంటి హెచ్చరిక సూచికలు పెట్టకుండా వదిలేయడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. రమేశ్​ కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతదేహంతో ఆందోళనకు దిగారు.

ఇదీ చదవండి:శత్రువు కన్నుగప్పి సరిహద్దుకు చేర్చే రహదారి సిద్ధం!

ABOUT THE AUTHOR

...view details