ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని దొడ్డి గ్రామంలో తెదేపా వర్గీయుడు తాయన్న కుటుంబంపై వైకాపాకు చెందిన నరసన్నతోపాటు మరికొందరు దాడి చేశారు. తాయన్నతో పాటు భార్య, కుమారులను కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడిలో నలుగురు కుటుంబసభ్యులు గాయపడ్డారు.
తెదేపా వర్గీయులపై కర్రలతో వైకాపా కార్యకర్తల దాడి - kurnool district latest news
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా దొడ్డిలో తెదేపా వర్గీయులపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ నలుగురిని చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తెదేపా వర్గీయుడిపై వైకాపా కార్యకర్త కర్రలతో దాడి
కొద్దిసేపు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెళ్తుండగా.. అడ్డుకొని మళ్లీ దాడి చేశారని పేర్కొన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆదోని ఆసుపత్రికి తరలింంచారు.