అతి వేగంగా వెలుతున్న కూలీల ఆటో బోల్తా పడిన ఘటన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం దిర్శనపల్లి ఎక్స్ రోడ్డు సమీపంలో జరిగింది. ఫాతిమా బేగం అనే మహిళకు తీవ్ర గాయాలు కాగా ఎనిమిది మంది స్వల్పంగా గాయపడ్డారు.
కూలీల ఆటో బోల్తా.. మహిళకు తీవ్ర గాయాలు - సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం
కూలీల ఆటో బోల్తా పడిన ఘటన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం దిర్శనపల్లి ఎక్స్ రోడ్డు సమీపంలో జరిగింది. ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా ఎనిమిది మంది స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 ద్వారా సూర్యాపేట హాస్పిటల్కు తరలించారు.

కూలీల ఆటో బోల్తా
వీరందరూ తుంగతుర్తి మండలం వెలుగుపల్లి, కాశీతండాకు చెందిన వారుగా గుర్తించారు. రోజువారి కూలి పనికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 ద్వారా సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు.