ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ పి.సువర్ణ జ్యోతి సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.
ఎమ్మెల్యే మందలింపు.. మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం - తూర్పుగోదావరి జిల్లా వార్తలు
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే తనను అందరి ముందు దూషించారని ఆరోపిస్తూ.. ఓ మహిళా వాలంటీర్ బలవన్మరణానికి యత్నించింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఎమ్మెల్యే మందలింపు.. మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం
గ్రామంలో చేపట్టిన పాదయాత్రలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు... తనను అందరిలో దూషించడం వల్లే మనస్తాపంతో ఈ యత్నానికి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొంది. ఈ విషయంపై ఎమ్మెల్యేను వివరణ కోరగా వాలంటీర్‌ను తానేమీ దూషించలేదని స్పష్టం చేశారు. మరోవైపు వాలంటీర్‌ను తెదేపా నాయకుడు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి:యాదాద్రి ఆలయ కాటేజీ వద్ద అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఐరన్ పైపులు